Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు షాక్ - సెస్ పేరుతో చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరోమారు ప్రయాణికులపై భారం మోపింది. డీజల్ సెస్ పేరుతో భారీగానా వడ్డించింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ పెంపును మినహాయించింది. మిగిలిన అన్ని రూట్లలో పెంచేసింది. ఈ పెంపు భారం గురువారం నుంచే అమల్లోకి తెచ్చింది. 
 
ఈ పెంపుతో గత యేడాది కాలంలో ఇప్పటివరకు సగటున రూ.20 మేరకు భారం పడినట్టు అంచనా వేస్తున్నారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అదనపు చార్జీలను చెల్లించాల్సివుంటుంది. డీజల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై భారం పడటమే ఈ అదనపు సెస్సుకు కారణమని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. 
 
చార్జీల భారం ఇలా... 
 
తాజాగా విధించిన సెస్సుతో కిలోమీటర్లు పెరిగే కొద్దీ చార్జీలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై అధికభారం పడుతుంది. కనీస సెస్సును పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస బస్సులో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో రూ.10 చొప్పున పెంచేసింది. 
 
* పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కిలోమీటర్లకు కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.45 వరకు పెరిగింది. 
 
* ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా 90 పెరిగింది. 
 
* సూపర్ లగ్జరీ బస్సులో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.10, గరిష్టంగా 130 చొప్పున పెంచేశారు. ఏసీ బస్సు సర్వీసుల్లో 500 కిమీ వరకు రూ.10 నుంచి రూ.170 వరకు పెంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments