Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ టీచర్ల కోసం కేసీఆర్ చేయూత.. రూ. 2000లు, 25 కిలోల బియ్యం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:03 IST)
కరోనా, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో.. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పున అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. 
 
అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపికచేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశమున్నట్టు అధికారులు అంచనావేస్తున్నారు. 
 
ఎంపికైన వారికి మంగళవారం అంటే రేపటి నుంచి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరు చేయగా, పౌర సరఫరాల శాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధం చేసింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments