Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరెంట్ - నీళ్లు లేవనే వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చాయి... మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను కళ్లకు కట్టేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవన్నారు. రోడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలోని వైకాపా పాలకుల్లో కలకలం రేపాయి. ఏపీ మంత్రి మంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. 
 
క్రెడాయి ప్రాపర్టీ షోలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధపెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనే, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్‌ను సోదరుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments