Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (16:06 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం మల్లారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 
 
ఇందుకోసం ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని రటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని, అందువల్ల మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అంజిరెడ్డి అనే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, మల్లారెడ్డి అఫిడవిట్‌పై అంజిరెడ్డికి, రిటర్నింగ్ అధికారికి ఇప్పటికే సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అంజిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ : ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు 
 
ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారతీయ రైల్వే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడిపేలా చర్యలు చేపట్టింది. ఈ అంతిమ పోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది అహ్మదాబాద్‌కు చేరుకునే అవకాం ఉండటంతో వారి కోసం ఈ ప్రత్యేక రైలును నడుపనున్నట్టు సెంట్రల్ రైల్వే జోన్ ప్రకటించింది. 
 
ఈ రైలు శనివారం అర్థరాత్రి గం.1.45కు ముంబైలో బయలుదేరి ఉదయం గం.10.35కు అహ్మదాబాద్ నగరానికి చేరుకుంటుందని రైల్వేశాఖ తెలిపింది. అలాగే అభిమానుల సౌకర్యార్థం అహ్మదాబాద్‌ నగరంలోని మొతేరా స్టేషన్ వైపు వెళ్లే మెట్రో రైళ్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. 
 
భారత్ - ఆస్ట్రేలియా టీ20 టోర్నీ... హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వైజాగ్ మ్యాచ్ టిక్కెట్లు  
 
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుంది. ఈ ఫైనల్ పోరు తర్వాత ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ వైజాగ్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం శుక్రవారం నుంచి మొదలుపెట్టగా, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 
 
ఈ టిక్కెట్ల విక్రయాన్ని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం, గాజువాకలో రాజీవ్‌గాంధీ స్టేడియంల వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. తొలిరోజు 5 వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, రూ.600 టికెట్లు గంట వ్యవధిలోనే అయిపోయాయి. క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చున్నా టికెట్లు దొరక్కపోవడంతో పలువురు అభిమానులు నిరాశ చెందారు. 
 
మురికివాడల నుంచి వచ్చిన పలువురు మహిళలు గురువారం అర్థరాత్రి నుంచే క్యూలైనులో కాపు కాశారు. వీరి ద్వారా బ్లాక్‌లో ఆయా టికెట్లను విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి కౌంటర్లను పరిశీలించారు. రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.3,500, రూ.6 వేల విలువ కలిగిన టికెట్లు రోజుకు 5 వేల చొప్పు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. శనివారం కూడా ఆయా కేంద్రాల వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంల వద్ద ఈ నెల 22 లోగా, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం వద్ద 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం