Webdunia - Bharat's app for daily news and videos

Install App

135 అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

Webdunia
బుధవారం, 7 జులై 2021 (21:05 IST)
తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి ఖాళీగా ఉన్న 135 అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్లో పేర్కొంది. 
 
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
 
వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 135 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లు తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 
 
వివాహితులైన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు స్థానికంగా గ్రామ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థినుల వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18-35 ఏళ్లు ఉంటే సరిపోతుంది.
 
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 15 సాయంత్రం 5 గంటలోగా ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://mis.tgwdcw.in/ను సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
 
ఇతర పూర్తి వివరాలను, ఖాళీల వివరాలను పైన ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహించిన ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ నెల 16 నుంచి 24లోగా ఒరిజినల్ సర్టిఫికేట్లను స్క్రూటీని చేయించుకోవాల్సి ఉంటుంది.
 
అంగన్వాడీ టీచర్లు : 36
అంగన్వాడీ ఆయాలు: 83
మినీ అంగన్వాడీ టీచర్లు: 16 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments