Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక ఇష్టపూర్వకంతో కామవాంఛ తీర్చుకున్నా అది అత్యాచారమే.. తెలంగాణ హైకోర్టు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (09:09 IST)
బాలిక ఇష్టపూర్వకంతో ఒక పురుషుడు కామవాంఛ (శృంగారంలో పాల్గొనడం) తీర్చుకున్నప్పటికీ అది అత్యాచారమే అవుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. హైదరాబాద్ నగరంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
 
15 యేళ్ల బాలికను సమీప బంధువు ఒకరు ఇంటిం నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భందాల్చింది. ఈ గర్భాన్ని అబార్షన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కేసులో పై విధంగా తీర్పును వెలువరించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో 15 యేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే, ఖమ్మంకు చెందిన సమీప బంధువు 26 యేళ్ల వివాహితుడు వ్యక్తిగత పనులు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చే క్రమంలో బాలిక ఇంటికి వెళ్లివచ్చేవాడు. ఆ సమయంలో బాలికతో సన్నిహితంగా ఉంటూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదరించాడు. దీంతో ఆ బాలిక కూడా ఎవరికీ చెప్పలేదు. 
 
ఈ క్రమంలో ఆ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెల్లడైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేశారు. మరోవైపు, బాలిక గర్భం దాల్చడంతో దానిని తొలగించేందుకు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, బాలిక అప్పటికే 20 వారాల గర్భిణి కావడంతో తొలగించడం ఆమె ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతూ గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించారు. 
 
దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగానే కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. బాలిక ఇష్టపూర్వకంగానే బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని పేర్కొంది. గర్భం దాల్చిన కారణంగా బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, శారీరకంగాను, మానసికంగాను ఆమెపై తీవ్ర ప్రభావం ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం