Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు మృతిపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:17 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి బస్తీకి చెందిన ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులోని నిందితుడు రాజు ఆత్మహత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది. 
 
రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ విచారణ బాధ్యతలను వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు అప్పగించింది. ఈ నివేదికను నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
 
ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగాయి. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ,  అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు.  
 
ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగినట్లు వివరించారు. వీడియోలు శనివారం రాత్రి 8లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
 
మరోవైపు, రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని రాష్ట్ర డీజీవీ మహేందర్ రెడ్డి స్పష్టం చేస్తూ, ఈ అంశంపై ఇక రాద్దాంతం చేయొద్దని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments