Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... సెల్ఫ్ క్వారంటైన్‌కు ఎమ్మెల్సీ కె.కవిత

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (21:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్‌లో... "పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మనవి. నాకు రాపిడ్ టెస్టులో నెగటివ్ రాగా, ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్‌తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
దీంతో తెరాస ఎమ్మెల్యేగా విజయభేరీ మోగించిన కల్వకుంట్ల కవిత కూడా ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె ప్రకటించారు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎలెక్షన్ కౌంటింగ్ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఆమె కలిశారు.
 
తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హోమ్ ఐసొలేషన్ కు వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
 
దీనిపై కవిత స్పందిస్తూ, 'అన్నా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని కలిసిన నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు వెళ్తున్నా. ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటా. కొన్ని రోజుల పాటు పార్టీ శ్రేణులు ఎవరూ నా కార్యాలయానికి రావద్దని కోరుతున్నా' అని కవిత ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments