Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఈ బచ్చాగాళ్లే తెలంగాణ తెచ్చారు : కేటీఆర్

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (15:19 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలపై తెరాస నేత, మాజీ మంత్రి కేటీఆర్ తనదైనశైలిలో మాటల దాడి చేశారు. పరుష పదజాలంతో తిట్ల దండకం వినిపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలుపు ఎక్కువంటూ మండిపడ్డారు.
 
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ యువత వీర సైనికుల్లాగా ఉద్యమిస్తుంటే.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లను పట్టుకున్న వ్యక్తి ఉత్తమ్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని ఛోటామోటా నాయకులందరూ చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
 
ముఖ్యంగా, తాను గట్టిగా మాట్లాడితే బచ్చా అని అంటున్నారనీ, కాంగ్రెస్ దద్దమ్మలు ఇంట్లో దాక్కుంటే ఈ బచ్చాగాళ్లే ప్రత్యేక తెలంగాణను తెచ్చారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సైనికుడే కాదనీ, ఆయన ఓ బంట్రోతు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులంతా కాంగ్రెస్ పార్టీ‌కి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాహుల్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments