వావివరుసలు మరచిన యువతి.. తమ్ముడు.. అతని ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం..

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (08:22 IST)
ఆ యువతి వావివరుసలు మరిచిపోయింది. వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని ప్రేమించింది. అంతకుముందే అతని స్నేహితుడుతో ప్రేమాయణం కొనసాగించింది. అయితే, సోదరుడుతో ప్రేమ వ్యవహారం సాఫీగా సాగాలంటే తొలుత ప్రేమించిన వ్యక్తిని చంపేయాలని భావించింది. ఇందుకోసం సోదరుడుని ఒప్పించి, చంపేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. వరంగల్‌ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు చెందిన కోమటి విజయ్, రెడ్డిమల్ల రాంకీ అనే ఇద్దరు యువకులు మంచి స్నేహితులు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే క్రమంలో రాంకీ పెద్దనాన్న కూతురు, కాజీపేటకు చెందిన రెడ్డిమల్ల యామిని పరిచయమైంది. 
 
విజయ్‌తో ఆమె ప్రేమలో పడగా, వీరి వివాహానికి విజయ్‌ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అదేసమయంలో వరుసకు తమ్ముడైన రాంకీతోనూ యామిని శారీరక సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నా రు. 
 
ఓ రోజు రాంకీ తన స్వగ్రామమైన వర్ధన్నపేటకు యామినిని తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. తాను విజయ్‌తో కలిసినప్పటి ఫొటోలను స్నేహితులకు పంపిస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని, దీంతో తమ సంబంధం సాఫీగా సాగుతుందని సోదరుడిని ఒప్పించింది. ఆ తర్వాత విజయ్ హత్యకు వారిద్దరూ ప్లాన్ వేశారు. 
 
ఈ నెల 4న విజయ్‌ను రాంకీ తన ఇంటికి పిలిచాడు. వివిధ ప్రాంతాల్లో కారులో తిరిగిన అనంతరం 5న గీసుకొండ శివారు కాకతీయ కెనాల్‌ వద్ద ఇద్దరూ మద్యం సేవించారు. మత్తులో ఉన్న విజయ్‌ ముఖంపై రాంకీ బలంగా గుద్ది కెనాల్‌లోకి తోసేయడంతో నీటిలో కొట్టుకుపోయాడు.
 
ఈ నెల 7న వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్‌లో మృతదేహం బయటపడగా, గుర్తు తెలియని వ్యక్తిదిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదేసమయంలో తన కుమారుడు కానరావడం లేదని విజయ్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఆ మృతదేహం విజయ్‌దిగా పోలీసులు తేల్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగు చూసింది. పక్కా సమాచారంతో రాంకీ, యామినిని శనివారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments