చైనాలో కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వైరస్ బారీన పడగా.. లక్షల మంది మృతి చెందారు. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, సిని ప్రముఖులకు ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
అయితే... ఈ కరోనా వైరస్ కొందరికీ లక్షణాలు లేకున్నా కూడా టెస్టుల్లో పాజిటివ్ వస్తోంది. దీంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు ఎలాంటి లక్షణాలు లేకున్నా... అయిదు నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది.
భరత్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు శారధకు 31 సార్లు కరోనా పరీక్షలు చేశామని.. ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ భరద్వాజ్ చెప్పాడు. అయితే.. ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ వస్తుందని కూడా పేర్కొన్నారు.