Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:30 IST)
టీఆర్‌ఎస్‌ జెండా పండుగను గురువారం (సెప్టెంబర్‌ 2న) రాష్ట్రంలో మూలమూలలా ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.
 
గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒకరూ జెండా పండుగలో భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు.
 
గురువారమే ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం జెండా పండుగ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.

హైదరాబాద్‌ నగర విసృ్తతి, జనాభా, భిన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వారంలోనే ప్రత్యేక సమావేశం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ, డివిజన్‌ కమిటీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం సమన్వయంతో ఈ కమిటీలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments