Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: ద్వితీయ భాషగా తెలుగు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (11:21 IST)
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాష‌గా త‌ప్ప‌నిస‌రిగా బోధించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.
 
బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాల‌ని ఆదేశాలిచ్చింది తెలంగాణ సర్కారు. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠ‌శాల‌ల్లో మాతృభాష‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.
 
గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒక‌టి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగు భాష బోధ‌న‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. 
 
ఈ విద్యా సంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments