Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదనీ టెక్కీ భర్త ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ పట్టణంలో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ బలవన్మరణానికి పాల్పడింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈ  ఘటన సోమవారం గజ్వేల్‌ పట్టణంలో చోటుచేసుకుంది. 
 
గజ్వేల్‌ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గజ్వేల్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్‌రెడ్డి (30)కి గత ఏడాది డిసెంబరులో మహబూబ్‌నగర్‌ చెందిన కొమ్మారెడ్డి ప్రవళిక అనే యువతితో వివాహమైంది. లాక్డౌన్‌ నేపథ్యంలో అతను గజ్వేల్‌లో ఉంటూ ఇంటి వద్ద నుంచే కంపెనీ పనులు చేస్తున్నాడు. పెళ్లి అయిన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఆమె రావడం లేదు. 
 
తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అందుకే తాను మీ ఇంటికి రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవన్‌రెడ్డి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన చరవాణిలో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నానని వీడియో రికార్డు చేసి తల్లి సుందరి, ఇతర బంధువులకు పంపించాడు. 
 
ఈ వీడియోను చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపును పగులగొట్టి గదిలోకి వెళ్లగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించిన జీవన్‌రెడ్డిని కిందకు దింపి గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లి సుందరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments