Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

Advertiesment
Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:45 IST)
కోవిడ్ వైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. తాజాగా షాకింగ్ న్యూస్ ఏమింటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కరోనా మహమ్మారి వదల్లేదని తెలిసింది. 
 
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేరారు.
 
సీఎం కేసీఆర్ గజ్వేల్ లోని ఫాం హౌస్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న కేసీఆర్ కి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. 
 
గత నాలుగు రోజుల క్రితం సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ది నోముల భగత్ సహా మరికొంత మంది నేతలకు ఈ కరోనా సోకినట్లు తెలుస్తుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్లో...