తెలంగాణాలో తెరుచుకోనున్న పాఠశాలలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:25 IST)
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడివున్నాయి. అయితే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటుండగా, తెలంగాణలో విద్యా సంస్థలు కూడా పై తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తూ తరగతులను ప్రారంభించారు. 
 
తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోపు తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
 
అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
 
ఈ మధ్యనే 9,10, ఆపై తరగతుల వారికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వారికి మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 6,7,8 తరగతులను ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరీ మిగత కింది తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments