Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు.. తెలంగాణాలో విపరీతంగా మాంసం విక్రయాలు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (09:46 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. దీంతో ఈ రాష్ట్రంలో మాంసం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే గత నాలుగేళ్లలో మాంసం కోసం రూ.58,500 కోట్లను తెలంగాణ వాసులు వెచ్చించారు. 
 
దేశంలో అత్యధికంగా మాంసాహారం విక్రయిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసార పరిశోధనా సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. 
 
గత నాలుగేళ్లలో అమ్ముడైన మాంసం ధర కిలోకు సగటున రూ.600గా లెక్కిస్తే రూ.58,500 కోట్లకు మాంసం కోసం జనం వెచ్చించారు. ఇక గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.90 లక్షలకు పేగా గొర్రెలు ఉన్నాయి. 
 
రాష్ట్రంలో 2015-16లో గొర్రెలు, మేకలు మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులుగా ఉండగా, 2020-21 నాటికి అది రెండింతలై 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ యేడాది అది 3.50 లక్షల టన్నులకు చేరుకుందని అంచనా వేసింది. ఇందుకోసం తెలంగాణ వాసులు రూ.31 వేల కోట్లకు పైగా వెచ్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
దేశంలో గొర్రెలు, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలు అయితే, తెలంగాణాలో అత్యధికంగా 21.17 కిలోలుగా ఉంది. గొర్రెల పంపిణీ పథకం వల్ల కొత్తగా రూ.7920 కోట్ల సంపదను సృష్టించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments