Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతికి అది ఇచ్చారని మండిపడుతున్న నాయకులు.. ఎవరు?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (19:42 IST)
పార్లమెంటు ఎన్నికల్లో ప్రచార సారథిగా బాధ్యతలను భుజాన ఎత్తుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరుస్తారా. స్టార్ క్యాంపైనర్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్న రాములమ్మ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సక్సెస్ కాగలదా. ఇంతకీ రాములమ్మ కొత్త కొలువుపై పార్టీలో సీనియర్స్ ఏమనుకుంటున్నారు..?
 
లోక్ సభ ఎన్నికలకు సిద్థమవుతున్న తెలంగాణా కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రచార ఛైర్మన్ పదవి కొత్త కుంపటిని రాజేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ ఉన్న విజయశాంతికి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలను అప్పగించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె గతంలో ప్రచారం చేసినా 19 స్థానాలకే పార్టీ పరిమితమైంది.
 
ఆ ఫలితాలు చూసి కూడా విజయశాంతికి పార్లమెంటు ప్రచార సారథి బాధ్యతలు ఎలా అప్పచెబుతారని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఆమెకు అప్పగించిన బాధ్యతలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మరోసారి ఇలాంటి పదవులకు ఆమెకు అప్పగించొద్దంటూ అధిష్టానం దృష్టికి నేతలు తీసుకెళ్ళారట. అయితే నేతలు ఫిర్యాదు చేసినా అధిష్టానం మాత్రం లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకున్న చరిష్మాతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లను వచ్చేట్లు చేస్తానంటున్నారు విజయశాంతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments