తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే తాటికల్లుకు జర్మనీ దేశస్థులు ఫిదా అయ్యారు. జర్మనీ దేశానికి చెందిన శ్రీసాయి ట్రస్టు ప్రాణికల్ యోగా సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది జర్మనీదేశస్థులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపేశ్వరాలయానికి వచ్చారు.
ఆలయ ప్రాంగణంలో యోగ శిక్షణ తరుగతుల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రాణికల్ యోగ సాధన చేశారు. గణపేశ్వరాలయంలో నగిశీలు, శిల్ప సంపదకు ముగ్దులయ్యారు. కెమెరాల్లో ఫొటోలు తీసుకున్నారు. గుడికి దగ్గరే ఉన్న తాటివనానికి వెళ్లిన జర్మన్లు… కల్లుతాగారు. తాటికల్లు రుచికి వారు ఫిదా అయ్యారు. కల్లు ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు. కల్లుగీత కార్మికులు చెట్టుపైకి ఎక్కి.. కిందకు దిగడం చూసి షాకయ్యారు. ఇది యూనిక్ టాలెంట్ అంటూ మెచ్చుకున్నారు.
వెంకటాపురం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన తాము… జర్మనీలో స్థిరపడి అక్కడ శ్రీసాయి ట్రస్టు ప్రాణికిల్ యోగా సంస్థను స్థాపించామని.. యోగ శిక్షణను ఇస్తున్నామని ట్రస్ట్ ఛైర్మెన్ సాయిరెడ్డి చెప్పారు. జర్మనీ నుంచి యోగా విద్యార్థులను.. ప్రతి ఏడూ తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా పర్యటిస్తామని వెల్లడించారు.