తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : బరిలో ఎలక్షన్ కింగ్ పద్మరాజన్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (16:47 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పద్మరాజన్ పోటీ చేస్తున్నారు. అదీ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. టేప్ రిపేరు షాపు నడుపుతూ వచ్చిన పద్మరాజన్ గత 1988 నుంచి అసెబ్లీ ఎన్నికల్లో తొలిసారి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. మాజీ ప్రధానులు వాజ్‌పేయి, పీవీ నరసింహా రావులపై కూడా పోటి చేసి ఔరా అనిపించుకున్నారు. 
 
ప్రస్తుతం తెలంగాణ సీఎంపై ఆయన పోటీ చేస్తున్నారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ పోటీతో కలిపి ఆయన ఇప్పటివరకు మొత్తం 236 సార్లు పోటీ చేశారు. తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆయన.. ఇపుడు తెలంగాణాలో కూడా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పద్మరాజన్‌‍తో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments