ఉమ్మడి - పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్ప - నేడు టీడీపీ - జనసేన పార్టీ భేటీ

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (15:13 IST)
ఉమ్మడి - పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పన కోసం గురువారం విజయవాడ వేదికగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య రెండో సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇటీవల రాజమండ్రిలో తొలి సమావేశం జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేడు మరోమారు ఇరు పార్టీలు మరోమారు సమావేశయ్యాయి. ఇందులో ఉమ్మడి, పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సాగుతుంది. 
 
గురువారం విజయవాడలో టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగింది. నోవోటెల్ హోటల్‌లో జరిగిన ఈ కీలక భేటీకి టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర సీనియర్ నేతలు హాజరు కాగా... జనసేన తరఫున నాదెండ్ల, తదితర అగ్రనేతలు విచ్చేశారు. 
 
ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా నేటి సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం, ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments