Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో తెలంగాణ - ఆంధ్రా ఎంపీల వారసులు! అందుకే...

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (14:54 IST)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌ పబ్‌లో జూబ్లీ హిల్స్ పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీల కుమారులు, కుమార్తెలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణకు చెందిన మాజీ డీజీపీ కుమార్తె‌తో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఉన్నట్టు వినికిడి. అందుకే ఈ పబ్‌పై దాడి చేసిన జూబ్లీహిల్స్ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును సస్పెండ్ చేయగా, ఏసీపీకి చార్జ్ మెమో ఇచ్చారు. 
 
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో దాదాపు అందరూ ప్రముఖుల వారసులే ఉన్నారు. ఇపుడు అధికారులు చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. పబ్‌లో మాజీ డీజీపీ కుమార్తె, ఏపీకి చెందిన మాజీ ఎంపీ కుమారుడు, తెంగాణాకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కుమారులు ఉన్నారు. అలాగే, పబ్‌లో లిక్విడ్ రూపంలో డ్రగ్స్ కూడా దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, అదుపులోకి తీసుకున్న వారిలో 12 మందిని మినహా మిగిలిన అందరినీ పోలీసులు నోటీసులిచ్చి పంపించేశారు. 
 
జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ 
 
హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ పోలీసులు ఆక్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి వివరాలు సేకరించి వదిలివేశారు. స్టేషన్‌కు తరలించిన వారిలో సినీ సెలెబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో ఈ వ్యవహరంపై పోలీసు పెద్దలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు చేపట్టారు. 
 
ఈ పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, ఏసీపీకి చార్జిమెమో జారీ చేశారు. ఈ పబ్‌పై దాడి వ్యవహారం ఇపుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments