Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ భేటీ... క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:32 IST)
తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ మంతనాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌తో తెగతెంపుల కోసమే కేసీఆర్‌ను పీకే కలిశారని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రశాంత్‌ కిషోర్‌కు, తెరాసకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. 
 
తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు.
 
పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇక, పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో కాంగ్రెస్ కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదనే అంశాన్ని తేల్చి చెప్పారని రేవంత్ స్పష్టం చేసారు. మే 6 న బహిరంగ సభ లోనూ రాహుల్ ఇదే విషయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.  

సంబంధిత వార్తలు

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments