తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఇందుకోసం ఆయన తన వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు.
శివావయంలో మహాకుంభాభిషేకంలో భాగంగా, మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామి అనుగ్రహ భాషణం చేపడుతారు. ఆ తర్వాత మహదాశీర్వాదం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్టాయాగ పరిసమాప్తి పలుకనున్నారు. సీఎ కేసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.