పాస్ చేస్తానని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.. నా మృతికి మీరే కారణం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో కేవలం 50 శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. కరోనా వైరస్ కారణంగా ఈ పరీక్షలను తొలుత రద్దు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఆలస్యంగా నిర్వహించి, గురువారం ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
అయితే, ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రటించాడు. దీనికి కారణం ఆ ఇద్దరు మంత్రులేనంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ వెల్లడించాడు. 
 
తాను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానిని, ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇపుడు అందర్నీ ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. 
 
దీంతో క్షణాల్లో ఆ విద్యార్థిని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి, విద్యార్థి ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇంతలోనే ఆ విద్యార్థి తాను క్షేమంగా ఉన్నానని ఓ ట్వీట్ చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments