Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం ఒరగబెట్టారు..!? డెంగ్యూతో చనిపోతే రూ.50 లక్షలు ఇవ్వాలి : తెలంగాణ హైకోర్టు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ డెంగ్యూతో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే, డెంగ్యూ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 30 రోజుల ప్రణాళికలో ఏం ఒరగబెట్టారంటూ నిలదీసింది. పైగా, డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవలి కాలంలో పలువురు రోగులు డెంగ్యూ వ్యాధితో మృతి చెందారు. ఇలా డెంగ్యూ వ్యాధితో మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గురువారం ఈ వ్యవహారంపై కోర్టుకు.. తెలంగాణ సీఎస్‌ వివరణ ఇచ్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ప్రభుత్వం తరపున నివారణ చర్యలు తీసుకున్నామని సీఎస్‌ ఎస్కే జోషి చెప్పారు. అయితే.. నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు నమోదవుతున్నాయ్? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ మాటలు... వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయన్న హైకోర్టు కన్నెర్రజేసింది.
 
పైగా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోనూ నదుల మధ్యే నగరాలున్నాయన్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 30 రోజుల ప్రణాళికలో ఏం ఒరగబెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. 'ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి.. వాస్తవ రూపం దాల్చలేదు. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయి. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్‌ నాటికి 3800 కేసులు పెరిగాయి. డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి' అని హైకోర్టు తేల్చిచెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments