Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం

రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా వైన్ షాపుల ఆగడాలకు బ్రేక్ వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యా

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:19 IST)
రిటైల్ మద్యం దుకాణాల్లో పారదర్శకత కోసం లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా వైన్ షాపుల ఆగడాలకు బ్రేక్ వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాప్ ద్వారా వివిధ రకాల మద్యం బ్రాండులు వాటి ఎంఆర్పీ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

లిక్కర్ అమ్మకాల్లో మద్యం షాపుల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని ఫిర్యాదులు అందడంతో ఈ యాప్‌ను పరిచయం చేసినట్లు తెలంగామ ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. 
 
ఈ యాప్ ద్వారా ఒకే క్లిక్‌తో అన్ని రకాల మద్యం బ్రాండ్ల వివరాలతో పాటు ఎంఆర్పీ రేట్లు తెలుసుకోవచ్చునని పద్మారావు తెలిపారు. ఈ యాప్ ద్వారా మద్యం షాపుల దందాకు బ్రేక్ పడుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రతీ షాపు ముందు ఆంగ్లం, తెలుగు రెండింటిలో మద్యం బ్రాండ్ల ధరలను పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అకున్ సబర్వాల్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments