ప్రారంభోత్సవానికి 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (21:08 IST)
నిరుపేదల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పంతో జిహెచ్ఎంసి పరిధిలో ఎంపిక చేసిన 111 ప్రాంతాల్లో ఒక లక్ష గృహాల నిర్మాణ లక్ష్యం త్వరలో నెరవేరనుంది. ఆర్.సి పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ క్రింద చేపట్టిన 15,600 గృహాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 
 
మరి ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్టు ఇదే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కమిషనర్ ప్రోద్బలంతో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి సంకల్పించిన లక్ష్యాన్ని నెరవేర్చారు. 
 
రూ. 1422.15 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్ట్‌మెంట్లకు తీసి పోకుండా సకల హంగులతో నిర్మించారు. 
 
మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసి ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులకు నీటి అందించేందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

తర్వాతి కథనం
Show comments