ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై లంచ్ మీటింగ్ జరుపుతారు.
 
ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో ఆయన ఫోనులో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని నిర్ణయించారు. 
 
అయితే, ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబైకు వెళ్ళనున్నారు. గత బుధవారం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీపై సాగిస్తున్న పోరులో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. "కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే సరైన సమయం" అని ఈ సందర్భంగా ఠాక్రే వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments