Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:47 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసైతో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా 8 లక్షల కోట్లు ప్రజాధనం కేసీఆర్ దోచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
మునుపు తను ఎప్పుడు వచ్చినా ఎంతో గౌరవంతో మాట్లాడే కేసీఆర్ కళ్లు ఇప్పుడు నెత్తికెక్కాయనీ, కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకే అమెరికా నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెరాసకి 30 సీట్లు కూడా రావని అన్నారు. ఈ మాట తను చెప్పడంలేదనీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియకు ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.

 
ఇక ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ చేసిన అప్పులను తీర్చేందుకు కనీసం 20 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. మొత్తమ్మీద అటు కేసీఆర్ పైన ఇటు జగన్ పైన కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments