Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో కేసీఆర్ దంపతులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు.  బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు కేసీఆర్ దంపతులు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. 
 
స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర.
 
ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు,పలువురు ప్రజా ప్రతినిధులు. అనంతరం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న 150 మంది రుత్వికులు. మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొంటారు సీఎం కేసీఆర్. 
 
మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శనలో పాల్గొననున్నారు కేసీఆర్. 12.20 నుండి 12.30 శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం. 
 
యాదాద్రి ఆలయ పున ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు దేవస్థానం అధికారులు.
 
మహిమాన్వితమైన యాదాద్రిని తెలంగాణ సర్కారు పునర్నిర్మాణం చేసింది.ఈ పవిత్ర స్థలంలో వాస్తుశిల్పం అద్భుతంగా పునరుద్ధరించబడింది. ప్రతిరోజూ దాదాపు 500 శిల్పాలు చెక్కబడ్డాయి నాలుగేళ్లలో మొత్తం ఆలయం నిర్మించబడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్చి 28న అంటే ఈ రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments