Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కర స్నానం చేసిన కేసీఆర్.. జోగులాంబ ఆలయ అభివృద్ధికి హామీ

కృష్ణా పుష్కరాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం పుష్కర స్నానమాచరించారు. ఆలంపూర్ వద్ద ఆయన పుష్కర స్నానం చేశాడు. అనంతరం బోగులాంబ ఆలయానికెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (10:33 IST)
కృష్ణా పుష్కరాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం పుష్కర స్నానమాచరించారు. ఆలంపూర్ వద్ద ఆయన పుష్కర స్నానం చేశాడు. అనంతరం బోగులాంబ ఆలయానికెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ముహూర్తం ప్రకారం సరైన లగ్నంలో పుష్కరాలు ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా పుష్కలంగా వానలు కురవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. పుష్కరాలు రావడం చాలం సంతోషమన్నారు.  
 
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరం అంటే బెజవాడ, గోదావరి పుష్కరం అంటే రాజమండ్రిలా ప్రచారం చేశారని విమర్శించారు. గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించినం. కృష్ణా పుష్కరాలు కూడా వైభవంగా నిర్వహిస్తాం. పుష్కర స్నానం తర్వాత దైవ దర్శనం చేసుకోవడం ఆచారం. పుష్కర స్నానం చేసి శక్తి పీఠాన్ని దర్శించుకునే అరుదైన స్థలం అలంపూర్. ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ సన్నిధికి ఎందరో అమ్మవారి ఉపాసకులు వస్తుంటారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే అంశంపై పురావస్తు శాఖ అధికారులతో చర్చిస్తామని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments