Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలి.. సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (09:35 IST)
యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని సీఎం వివరించారు. కరోనా నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందని సీఎం చెప్పారు. 
 
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. 
వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్‌లో చర్చించారు.
 
ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్‌లు గొంగిడి సునిత, రేగ కాంతారావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, చల్లా ధర్మారెడ్డి, గణేష్ గుప్త, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments