Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త.. ఒక్క రోజు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (16:58 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ సోమవారం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ శుభవార్త చెప్పారు. అభివృద్దిలో మహిళలది అత్యంత కీలక పాత్ర కొనియాడిన ఆయన... ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. 
 
నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీపడుతున్నారనీ, మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని సిఎం తెలిపారు. 
 
వారిని అభివృద్ది పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments