Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా తెలంగాణ: మాజీ ఐపీఎస్ అధికారి

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:05 IST)
కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమీ లేదని, అయితే అవినీతిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఏదైనా చేశారంటే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా మార్చారు. 7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను. ‘జన సేవ సంఘ్’ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను’’ అని వీకే సింగ్ అన్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్స్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని అన్నారు.
 
గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. జైళ్లలో ఎక్కువ శాతం మంది ఎలాంటి నేరాలు చేయని బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వీకే సింగ్ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments