Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫస్టియర్ అందరూ పాస్: అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:29 IST)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా కాలంలో ఆల్ పాస్ అని చెప్పి... ఫెయిల్ చేశారనే ఆరోపణలు, ఆందోళనలు మొదలైయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ మినిమమ్ పాస్ మార్కులు 35 వేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 
 
విద్యార్థులెవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు దగ్గర్లోనే ఉన్నందున విద్యార్థులెవరూ ఒత్తిడికి గురికావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
 
ఇంటర్ బోర్డు, ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదన్నారు. పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు చేయొద్దన్నారు. కరోనాతో విద్యార్థులు ఎంతో నష్టపోయారని.. అందుకే 70 పర్సంటేజ్ సిలబస్ తోనే ఎగ్జామ్స్ పెట్టామన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తే పాస్ చేస్తారనుకోవడం తప్పన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్ అన్నారు. 
 
ప్రతి విద్యార్థికి ఇంటర్ టర్నింగ్ పాయింట్ అని అన్నారు. 10 వేల మంది స్టూడెంట్స్ 95 శాతం స్కోర్ చేశారన్నారు. కష్టపడి చదవాలని విద్యార్థులను కోరారు. రివాల్యూయేషన్ అప్లై చేసుకున్న విద్యార్థులు 35 మార్కులతో సంతృప్తి చెందితే వారి ఫీజును వెనక్కి ఇస్తామన్నారు. లేకపోతే రివాల్యూయేషన్ చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments