Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడిపై మనసు పారేసుకున్న యువతి ... తండ్రి మందలించడంతో...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (09:27 IST)
వరుసకు అల్లుడు (అన్న కుమారుడు)పై ఓ మైనర్ బాలిక మనసు పారేసుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిందడ్రులు ఆమెను మందలించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తాగా తన ప్రియుడితో అర్థరాత్రి చాటింగ్ చేస్తూ తండ్రి కంటపడింది. దీంతో ఆయన కాస్తంత గట్టిగా మందలించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆ యువతి తెల్లారేసరికి అనుమానాస్పదంగా కనిపించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని ఆదిలాబాద్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండల కేంద్రమైన నార్నూలులోని పోలీస్ స్టేషనులో ఇందూరు ఊశన్న హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన భార్య వసంత. అదిలాబాద్ గ్రామం. అయితే, వసంత ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ విధులు నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో తన కూతురు వైష్ణవి (15)తో కలిసి స్థానిక క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 
 
తన ఏకైక కూతురునుగారంగా పెంచారు. ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా వైష్ణవికి వరుసకు అన్న అయిన బంధువు అన్న కుమారుడితో ప్రేమ వ్యవహారం సాగుతోంది. గమనించిన కుటుంబ సభ్యులు గతంలోనే వారిని మందలించారు. ఇదే విషయమై తరచూ గొడవలు జరిగేవి. ఆమెకు కౌన్సెలింగ్‌ సైతం చేసినా మార్పు రాలేదు. 
 
శుక్రవారం రాత్రి ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుండగా గమనించిన తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు. కాగా బాలిక మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లి వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments