Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (17:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్ మల్లన్నకు చెందిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఈ కార్యాలయంలోనే ఆయన క్యూ న్యూస్‌ అనే పేరుతో ఓ న్యూస్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 
 
దాడి తర్వాత సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. దాడి ఘటన సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేకపోవడంతో ఆయనకు ప్రాణముప్పు తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments