Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్‌ను నడిరోడ్డులో ఉరితీయాలి : తీన్మార్ మల్లన్న

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (19:26 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను మోసం చేసిన కేటీఆర్‌ను నడిరోడ్డులో ఉరితీయాలన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. 
 
ఉద్యోగం రావడం లేదన్న బెంగతో కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండేంగ తేజవత్‌రామ్‌సింగ్‌ తండాకు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్‌నాయక్‌ (28) పురుగుల ముందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
ప్రస్తుత అతను ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థి సునీల్‌ను తీన్మార్ మల్లన్న పరామర్శించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగం పోగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 
 
సునీల్‌ను వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి మంచి వైద్యం అందించాలని తీన్మార్‌ మల్లన్న డిమాండ్ చేశారు. స్నేహితులు వెంటనే సునీల్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌ను విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు పరామర్శిస్తున్నారు. 
 
వైఎస్ షర్మిల అనుచ‌రులు ప‌రామ‌ర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘అక్క వ‌స్తోంది.. అన్ని క‌ష్టాలు తీరుతాయి’ అని సునీల్‌కు ష‌ర్మిల అనుచ‌రులు భ‌రోసాను షర్మిల మద్దతుదారులు ఇచ్చినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments