Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకు బతికున్నావు.. చచ్చిపో... నారాయణ విద్యార్థినికి టీచర్ వేధింపులు

"నువ్వు కడుపునకు గడ్డితింటున్నావా? మట్టి తింటున్నావా? ఎందుకు బతికున్నావు.. చచ్చిపో! నా వెనుక ప్రిన్సిపాల్‌ ఉన్నారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో" అంటూ ఓ విద్యార్థిని టీచర్ తిట్టిపోసింది.

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (10:52 IST)
"నువ్వు కడుపునకు గడ్డితింటున్నావా? మట్టి తింటున్నావా? ఎందుకు బతికున్నావు.. చచ్చిపో! నా వెనుక ప్రిన్సిపాల్‌ ఉన్నారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో" అంటూ ఓ విద్యార్థిని టీచర్ తిట్టిపోసింది. అదీ కూడా నారాయణ కాలేజీలో. గణితంలో తనకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించినందుకు ఆ విద్యార్థినిని ఇలా ఓ అధ్యాపకురాలు నోటికొచ్చినట్టు తిట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన విద్యార్థిని (16) కూకట్‌పల్లి వెంకట్రావ్‌నగర్‌ సమీపంలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లోనే ఉంటోంది. ఆరునెలల క్రితం.. తరగతి గదిలో స్నేహితులతో మాట్లాడిందనే కోపంతో సదరు విద్యార్థినిని గణిత లెక్చరర్‌ కీర్తి తీవ్రంగా మందలించింది. అనంతరం జరిగిన పరీక్షలో బాధిత విద్యార్థినికి ఉద్దేశపూర్వకగా తక్కువ మార్కులు వేసినట్టు తెలిసింది. ఆందోళన చెందిన విద్యార్థిని.. అధ్యాపకురాలు కీర్తిని ప్రశ్నించింది. 
 
దీన్ని మనస్సులో పెట్టుకుని ఆ టీచర్.. ఆ విద్యార్థినిని వేధించసాగింది. ఈ నేపథ్యంలో గత ఆదివారం రాత్రి కూడా బాధిత విద్యార్థిని ఆమె కొట్టి, నోటికొచ్చినట్టుదూషించింది. అధ్యాపకురాలు కీర్తి ధోరణితో తీవ్ర కలత చెందిన బాధిత విద్యార్థిని సోమవారం ఉదయం బ్లేడుతో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థిని ఫోన్‌లో ఇచ్చిన సమాచారం మేరకు ఆమె తండ్రి కాలేజీకి వచ్చి లెక్చరర్‌ కీర్తి, ప్రిన్సిపాల్‌ చంద్రికను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆయన మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లెక్చరర్‌ కీర్తిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments