Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీం అనుమ‌తి

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (06:28 IST)
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కృష్ణా ట్రిబ్యున‌ల్ నియామ‌కంపై దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కృష్ణా జ‌లాల పంప‌కంపై కొత్త ట్రిబ్యున‌ల్ కోరుతూ గ‌తంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

అయితే ఈ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ట్రిబ్యున‌ల్ ఏర్పాటుపై ప్ర‌స్తుతం ఆదేశాలు ఇవ్వ‌ట్లేద‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

అభ్యంత‌రాల దాఖ‌లుకు ఏపీ, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అవ‌కాశం కోరాయి. దీంతో అభ్యంత‌రాల దాఖ‌లుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది.

పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకుంటే కొత్త ట్రిబ్యున‌ల్ ఏర్పాటును ప‌రిశీలిస్తామ‌ని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచ‌న‌తో పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి కోరింది. దీంతో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments