Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల ఆందోళన

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:25 IST)
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన ఆగేట్లు లేదు. నేటితో ఇంటర్ రీ-వాల్యువేషన్,  రీకౌంటింగ్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో ఆల్ పాస్ కాకుండా ముప్పావు శాతం మందిని ఫెయిల్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌  చేశారు.
 
ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఆరు రోజుల పాటు ఈ ఆందోళన జరుగుతోంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. కనీస మార్కులతో పాస్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments