Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు భారీగా రష్యా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల దిగుమతి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (16:41 IST)
హైదరాబాద్ నగరానికి రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్లు భారీగా వచ్చాయి. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్లు వచ్చాయి. మొత్తం 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గోలో దిగుమతి అయింది. 
 
వ్యాక్సిన్ రష్యా నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్ (ఆర్‌యు-9459)లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. ఇప్పటివరకు భారతదేశానికి దిగుమ‌తైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. 
 
మరోవైపు, జూన్‌ 9 వరకు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్స్‌ సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. మధ్యాహ్నం 2 తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్డెక్కద్దు అని కోరారు. 
 
లాక్‌డౌన్‌ ప్రారంభమైన నుంచి పోలీస్‌ బాస్‌లు రోడ్డుమీదనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా వాహనాలు తనిఖీ, తదితర పనుల్లో బిజీగా ఉంటున్నారు. 
 
సోమవారం రాత్రి 7:30 సమయంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి రాచకొండ కమిషనరేట్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఇప్పటి వరకు ఉన్న ఉదయం 6-10 రిలాక్సేషన్‌ సమయాన్ని మధ్యాహ్నం 1:00 వరకు పెంచారు. ఆ సయయంలో బయటకు వచ్చిన ప్రజలు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి మరో గంట సమయాన్ని అదనంగా కేటాయించారు.

సంబంధిత వార్తలు

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments