Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (13:46 IST)
దసరా సెలవుల కోసం తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జంట నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దసరా స్పెషల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు కూడా శుక్రవారం నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, రోజువారీగా నడిచే రైళ్లలో కొన్నింటి సమయాల్లో సవరణలు చేయడం జరిగిందని, అందువల్ల ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరేముందు విచారించుకుని స్టేషన్‌కు రావాలని ద.మ.రై అధికారులు తెలిపారు. 
 
శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి మధ్య 07645 నంబరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు పేర్కొంది. శనివారం సంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్‌కు 07646 నంబరుతో ప్రత్యేక రైలు వస్తుందని తెలిపింది.
 
అలాగే, అక్టోబరు రెండో తేదీన సికింద్రాబాద్ - షాలిమార్‌ల మధ్య 07741 నంబరుతోను, అక్టోబరు 3వ తేదీన షాలిమార్ - సికింద్రాబాద్‌ల మధ్య 07742 నంబరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు పేర్కొంది. 
 
అక్టోబరు, 1, 8 తేదీల్లో కూడా నాందేడ్ - బర్హంపూర్ (07431), త్రివేండ్రం - టాటా నగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్ - నాందేడ్ (07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటా నగర్ - త్రివేండ్ర (06191) మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments