Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రెట్టింపు

Advertiesment
rail platform
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:57 IST)
దేశ వ్యాప్తంగా పండగ సీజన్ మొదలుకావడంతో అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో విపరీతమైన రద్దీతో కనిపిస్తున్నాయి. ఈ రద్దీని నివారించే చర్యలపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరలను తాత్కాలికంగా రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ పరిధిలోన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఈ టిక్కెట్ ధరను పెంచారు. 
 
ఇందులోభాగంగా, కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.10 నుంచి రూ.20కు పెంచారు. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయని దక్షిణ రైల్వే ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీస్ కొలీగ్‌తో శృంగారం.. భర్త గుండెపోటుతో మృతి.. భార్య ఏం చేసిందంటే?