Webdunia - Bharat's app for daily news and videos

Install App

85 ఏళ్ల వృద్ధురాలికి బియ్యం-కిరోసిన్ ఇచ్చి వండుకోమన్నాడు... ఆమె అలా చేసింది...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:10 IST)
కొడుకు భారంగా భావిస్తున్నాడని ఆవేదన చెందిన ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే 85 ఏళ్ల అందే కౌసల్య అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కొడుకు మరణించడంతో ఆమె ఆరేళ్లుగా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో నివసిస్తున్న తన చిన్నకుమారుడు బాస్కర్‌రెడ్డి వద్ద ఉంటోంది. 
 
తల్లిని భారంగా భావించిన అతను, తల్లిని వంతులువారీగా పెద్దకుమారుడి కుటుంబ సభ్యులతోపాటు ఉంచుకోవాలని కోరాడు. దానికి పెద్దకుమారుడి భార్య విముఖత వ్యక్తం చేయడంతో సోమవారం తల్లిని పెద్ద కుమారుడి ఇంటి వద్ద విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున చిన్న కుమారుడు గ్రామంలోని తన ఇంట్లోనే తల్లిని వేరుగా ఉంచి బియ్యం కిరోసిన్ అప్పగించి వండుకోమని చెప్పాడు. 
 
కొడుకు ప్రవర్తనకు మనస్థాపం చెందిన వృద్ధురాలు అతను ఇచ్చిన కిరోసిన్‌నే ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. ఈ ఘటనపై దుబ్బాక ఎస్‌ఐ సుబాష్‌గౌడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments