Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేషెంట్ కోసం అటెండర్‌గా వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (14:29 IST)
woman
దేశంలో మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పేషెంట్‍‌కు సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాధితుల్లో ఒకరు ఇంటికి చేరుకున్నారు. కానీ మరో మహిళ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతకీ ఆమె ఏమైనట్లు. నిందితులు ఆమెను ఏం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే..మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన కర్నె నర్సింహులు కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. ఆయనకు సాయంగా భార్య తిరుపతమ్మ ఆమె చెల్లెలు సువర్ణ వెళ్లారు. నర్సింహులును వేరు వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు తికమకపడ్డారు.
 
ఆ సమయంలో ఓపీ సెక్షన్‌లోని కంప్యూటర్‍ ఆపరేటర్‌ ఉమామహేశ్వర్‍ వార్డు చూపిస్తానని మచ్చిక చేసుకున్నాడు. వారిని ఓ స్టోరూంలోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారని బాధితురాలు చెబుతోంది. తనపై నలుగురైదుగురు అత్యాచారం చేసినట్లు బాధితురాలు విలపిస్తోంది. బాధితులు ముందుగా మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ గాంధీ ఆస్పత్రి పరిధిలోని పీఎస్‌కు వెళ్లాలని సూచించడంతో వారు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
 
గాంధీ ఆస్పత్రిలో ఐదు రోజులుగా ఇంత దారుణం జరిగినా వెలుగు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బంధవులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments