సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు, దళిత బంధు పథకాలన్నీ ఎన్నికల హామీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ గిరిజన విభాగం సమావేశంలో సీతక్క మాట్లాడారు.
దేశంలో 12 కోట్లమంది గిరిజనులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గిరిజనులకు పోడు భూములకు హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీనేనని ఆమె తెలిపారు.
దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు.
హరితహారం పేరుతో గిరిజనుల భూములను కేసీఆర్ గుంజుకున్నారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల్ ఇస్తామన్న కేసీఆర్, వాటిని పట్టించుకోలేదన్నారు. దీనిపై గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలన్నారు.
ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజు ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ, దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా అని సీతక్క ప్రశ్నించారు.