Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ప్రియుళ్ల కీర్తి ఏం చెప్పిందో చూడండి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (19:33 IST)
ఓ వ్యక్తి వల్ల గర్భం దాల్చి... మరో వ్యక్తి బ్లాక్‌‌మెయిలింగ్‌కు వశమై.. కన్నతల్లినే హతమార్చిన కీర్తి ఇప్పటికీ తన మొదటి ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.

జైలుపాలైన ఆమె ప్రవర్తన, మాటతీరు, నేపథ్యం ఆరా తీస్తున్న పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాల్‌రెడ్డి వల్ల గర్భవతి అయి.. అబార్షన్‌ చేయించుకున్న కీర్తి అతడినే వివాహమాడతానని స్పష్టం చేసింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మునగనూరులో తల్లి రజితను హత్య చేసిన కీర్తి తన 16 ఏళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాల్‌రెడ్డికి దగ్గరైంది.

అన్ని విషయాలు అతనితోనే పంచుకునేది. తల్లి లేనప్పుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లేది. గత ఏడాది సెప్టెంబరులో గర్భం దాల్చినట్టు ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడు బాల్‌రెడ్డి బెంగళూరులో ఉన్నాడు. అబార్షన్‌ చేయించుకున్న కీర్తి... గర్భధారణ వల్ల కలిగే మార్పులేమిటా అని అంతర్జాలంలో శోధించింది.

కొన్ని లక్షణాలు ఖరారు కావడం వల్ల తను అన్నయ్యా అని పిలిచే శశికుమార్‌కు చెప్పింది. మందుల దుకాణానికి వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్‌ తెచ్చి పరీక్షించుకోగా, గర్భం నిర్ధారణ అయ్యింది. తర్వాత శశికుమార్‌ ఇంటికి ల్యాబ్‌ సిబ్బందిని రప్పించి పరీక్ష చేయిస్తే, వారు ఆమెకు నాలుగో నెల అని ధ్రువీకరించారు. గర్భస్రావం కోసం ఆసుపత్రులకు తిరిగారు.

కీర్తి గర్భం దాల్చిందని తెలిసి, బాల్‌రెడ్డి నగరానికొచ్చాడు. గర్భస్రావం కోసం కొన్ని ఆసుపత్రులకు ఫోన్‌ చేశాడు. రెండు రోజుల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు చెప్పడంతో శశికుమార్‌ సాయం తీసుకున్నారు. రజితను ఒప్పించి శశికుమార్‌ కారులో కీర్తిని కొంత దూరం తీసుకొచ్చాడు.

అక్కడి నుంచి బాల్‌రెడ్డి, కీర్తి మాత్రమే ఆమన్‌గల్‌ వెళ్లారు. బాల్‌రెడ్డి మిత్రుడు నాయక్‌ సాయంతో ఆమన్‌గల్‌లో గర్భస్రావం చేయించి రెండు రోజులు అక్కడే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం