ఘట్‌కేసర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో యాజమాన్యం వేధింపులు ఎక్కువుతున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.
కోవిడ్-19 వల్ల గత రెండు సంవత్సరాలుగా స్కూల్‌లో ఎటువంటి తరగతులు జరగలేదనీ, ఇటీవల ప్రభుత్వం చొరవతో తెరుచుకున్న ఈ స్కూల్‌లో ఫీజుల విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల తీవ్రమైన ఒత్తిడి తీసుకవస్తున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.